గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం వద్ద కారు బోల్తా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలు
ఎస్ఆర్ పురం మండలం చొక్కామడుగు వద్ద శుక్రవారం సాయంత్రం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, వారి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ ఆలస్యమవ్వడంతో స్థానికులు స్పందించి బాధితులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.