అదిలాబాద్ అర్బన్: దొంగతనాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పట్టణంలో అవగాహన కల్పించిన వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్
పండగల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే వారు దొంగతనాల నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ చించర్వాడలో ప్రజలకు దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే స్టేషన్కు లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.