ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని 24 వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, వాటిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు
ఎమ్మిగనూరు పట్టణంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి వార్డులో తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వినతులను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.