ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో లెదర్ సొసైటీ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ, లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ ధర్నా..ఎమ్మిగనూరులో లెదర్ సొసైటీ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ, లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం మాగమ్మ, గౌరన్న, మాట్లాడుతూ.. 1950 సంవత్సరంలో 90 మంది దళితుల కుటుంబాలతో షేర్ హోల్డర్స్ గా ఏర్పాటు చేసి సొసైటీని స్థాపించారన్నారు.దాని అభివృద్ధి చేశాక షేర్ హోల్డర్స్ని పక్కన పెట్టి, కొంతమంది గుత్తేదారులు చొరబడి ఆస్తులు సైతం అమ్ముకుంటున్నారన్నారు.