శ్రీశైలం: మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ శ్రీశైల దేవస్థానం ఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన హౌస్ కీపింగ్ సిబ్బంది
శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనం వద్ద హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు.గత మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది. జీతాల గురించి అడిగితే అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు మోపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.ఏజెన్సీ మేనేజర్‌ను సంప్రదించినప్పటికీ నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. జీతం లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు.సుమారు 280 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.తక్షణమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈవో చొరవ తీసుకోవాలని డిమాండ్