శ్రీశైలం: తన వ్యవసాయ భూమి కాపాడండి. జమ్ము కాశ్మీర్ నుండి విడియో పోస్ట్ చేసిన,తమ్మడపల్లి గ్రామనికి చెందిన మహేష్
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన సైనికుడు భాష్యం మహేష్ ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.తనకు తమ్మడపల్లి గ్రామ పరిధిలో ఉన్న 2.38 ఎకరాల వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియో ద్వారా ఆరోపించాడు.తాను దేశ రక్షణ బాధ్యతల్లో ఉండగా,స్వగ్రామంలో తన ఆస్తికి రక్షణ లేకుండా పోవడం బాధాకరమని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.మహానంది మండల టిడిపి ఇన్‌చార్జి కంచెర్ల శివతో పాటు ఆయన అనుచరులు తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.