తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసినందుకు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా CM రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR శనివారం తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో నుంచి బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించడం, అలాగే తెలంగాణ రాజముద్రను మార్చడం ద్వారా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానించారని అన్నారు. ఈ చర్యలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడేందుకు ప్రజలు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.