జహీరాబాద్: షేకాపూర్ గ్రామంలో ఆటోను ఢీ కొట్టిన కారు, వ్యక్తికి గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేకాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం గ్రామంలో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఆటో మరో బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న గ్రామానికి చెందిన ఎజాజ్ పటేల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.