నంద్యాల అర్బన్: వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమం అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నరసముక్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్య రహిత భారత దేశ నిర్మాణానికి కృషి చేస్తున్న ఈగిల్ టీం సేవలను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు