శ్రీశైలం: నల్లమల అటవీ ప్రాంతంలో మూడు నెలల పాటు పర్యాటక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం
నల్లమల అటవీ ప్రాంతంలో మూడు నెలల పాటు పర్యాటక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పెద్దపులుల సంయోగ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జంగిల్ సఫారీలు, ఎకో టూరిజం పర్యటనలను నిలిపివేస్తూ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.జాతీయ పెద్దపులుల సాధికార సంస్థ (NTCA) మార్గదర్శకాల మేరకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించే జంగిల్ సఫారీలు, ఎకో టూరిజం కార్యక్రమాలను అటవీ శాఖ నిలిపివేసింది.