ఆత్మకూరు: అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు 50 గేట్లు ఎత్తి నీటిని విడుదల అధికారులు
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు నారాయణపూర్ నుంచి వరద ఉద్ధృతి కోనసాగుతోంది. ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయత్రం 50 గేట్లను ఎత్తి అధికారులు ప్రాజెకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల ముందు భారీ అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి ఎక్కువ అయ్యింది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని నదిలోకి ఎవరూ దిగరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.