గుంటూరు: అనునిత్యం ప్రజల కోసం పోరాడిన యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి: రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Guntur, Guntur | Sep 14, 2025 అనునిత్యం ప్రజల కోసం పోరాడిన యోధుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం కొత్తపేట సీపీఐ కార్యాలయంలో సురవరం సంస్మరణ సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. సభలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు లు సుధాకర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.