మండపేట: మండపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..
మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె.వి.శ్రీనివాసరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అంబేద్కర్ వేసిన బాటతో అనేక వేల మంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ బోధనలు అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమలో కాలేజ్ అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.