శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు ఘనంగా స్వర్ణ రథోత్సవ కార్యక్రమం
శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవం సందర్భంగా వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోకకల్యాణం కోసం దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని అర్చకులు సంకల్పం పఠించారు. భక్తుల శివనామస్మరణ, వేదమంత్రాల నడుమ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించి తిరిగి గంగాధర మండపానికి తిరిగి తిసుక వచ్చారు.