ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని అమ్మవారి శాలలో గత పది రోజులుగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం వసంతోత్సవంతో ముగిశాయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మూర్తిని పురవీధుల్లో పల్లకిపై ఊరేగింపు నిర్వహించారు, ఆర్యవైశ్యులు, పుర ప్రజలు పరస్పరం రంగులు చల్లుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవి శెట్టి హరీష్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు