గుంతకల్లు: గుత్తి మండలం శ్రీపురం గ్రామ శివారులో వేరుశనగ మిషన్ లో పడి మహిళకు తీవ్ర గాయాలు, అనంతపురంకు తరలింపు
గుత్తి మండలం శ్రీపురం శివారులో వేరుశనగ మిషన్ లో పడి మహిళకు తీవ్ర గాయాలు అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురం గ్రామ శివారులో ప్రమాదవశాత్తూ వేరుశనగ మిషన్ లో పడి లక్ష్మి దేవి అనే మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కుటుంబసభ్యులతో కలసి గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో యంత్రంతో వేరుశనగ తొలగింపు పనులకు వెళ్ళారు. వేరుశనగ పంట దిగుబడిని యంత్రంలోనికి వేస్తుండగా ప్రమాదవశాత్తూ చీర మిషన్ కు తగులుకుని లక్ష్మీదేవి మిషన్ లోకి పడి తీవ్రంగా గాయపడింది. అనంతపురంకు తరలించారు.