కర్నూలు: కక్ష సాధింపు చర్యలలో కూటమి ముందంజ: కర్నూలు కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్ పర్సన్ విజయ మనోహరి
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కక్ష సాధింపు చర్యలలో ముందంజలో ఉందని కేడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్పర్సన్ ఎస్వీ విజయ మనోహరి ఆదివారం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది తిరగకముందే అభివృద్ధికి బదులుగా వైసీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని మండిపడ్డారు. 87 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు చెల్లించాల్సి ఉండగా 67 లక్షల మందికే ఇచ్చారని ఆరోపించారు.