శ్రీశైలం: శ్రీశైలం పాతాళ గంగ లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శ్రీశైలం పాతాళ గంగలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ జీవన్ గంగనాథ్ బాబు మాట్లాడుతూ, మృతుడి ప్యాంటులో రేపల్లె నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ లభించిందని, షర్టుపై డీసెంట్ అనే స్టిక్కర్ ఉందని రేపల్లె పరిధిలో ఎవరైనా అదృశ్యం అయి ఉంటే శ్రీశైలం సీఐని గాని ఎస్ఐని గాని సంప్రదించాలని కోరారు.