శ్రీశైలం మండలం సున్నిపెంట పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో రెండు చిరుతపులుల సంచారం. సీసీ కెమెరాలో రికార్డు నమోదు
శ్రీశైలం మండలం సున్నిపెంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అర్ధరాత్రి చిరుతల సంచారం కలకలం రేపింది. కాలేజీ ఆవరణలో రెండు చిరుతలు తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.వేసవి సెలవులు ఉండటంతో విద్యార్థులు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.వాచ్‌మన్‌ను గమనించిన చిరుతలు లోపలికి రాకుండా వెనుతిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానికుల్లో భయం నెలకొంది.చిరుతలను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.