గుత్తి మండలం తొండపాడు గ్రామంలో సంజీవకర్ణ అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పై కప్పుకు ఉరి వేసుకున్న అతడిని గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.