శ్రీశైలం: ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తాలీం-ఏ-హునర్” నైపుణ్యాభివృద్ధి పోస్టర్ విడుదల చేసిన శ్రీశైలం MLA బుడ్డా
ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గంలోని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కోరారు.ఈ మేరకు నేడు వేల్పనూరులో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని, “తాలీం-ఏ-హునర్” ద్వారా విద్యార్థులు శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశం వస్తాయన్నారు.