కథలాపూర్: మహిళలు పౌష్టికహారం తీసుకోవాలి: వైద్యాధికారి విజయలక్ష్మి
మహిళలు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని క్లస్టర్ వైద్యాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారి - స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భిణీ మహిళలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింధుజ, హెచ్ఐవో వేణు,శ్రీధర్ ఉన్నారు.