శ్రీశైలం: శ్రీశైలంలో ఘనంగా హేమారెడ్డి మల్లమ్మ జయంతి వేడుకలను నిర్వహించిన దేవస్థాన అర్చకులు
శ్రీశైల మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన హేమారెడ్డి మల్లమ్మ వారి జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గోశాల సమీపంలోని మల్లమ్మ మందిరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా మహా గణపతి పూజ జరిపించి అనంతరం స్తోత్ర పారాయణలతో మల్లమ్మవారికి అభిషేకం, అర్చన జరిపించారు. చివరగా మల్లమ్మను స్తుతిస్తూ పలు భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు. అర్చకులు. వేద పండితులు భక్తులు పాల్గొన్నారు.