గూగుల్ డేటా సెంటర్ విశాఖ వేదిక కావడం గొప్ప విషయం అంటూ హిందూపురం ప్రెస్ క్లబ్ లో టిడిపి నాయకుల ప్రెస్ మీట్
అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుంద ని టిడిపి నాయకులు హిందూపురం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా టిడిపి జిల్లా అద్యక్షులు అంజినప్ప, మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, నాగరాజు లు మాట్లాడుతు సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొ త్తం లింక్ చేయబోతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్ల తెలుగు వాడి ప్రతిష్ట విశ్వ వ్యాప్తం అవుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ విప్లవం తీసుకు వచ్చినప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని గుర్తుచేశారు.