గుంతకల్లు: గుత్తి శివారులోని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్ లను తనిఖీ చేసిన డీఎస్పీ శ్రీనివాస్, ఎంవీఐ రాజాబాబు
గుత్తి పట్టణ శివార్లలోని జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్, ఎంవీఐ రాజాబాబు, సీఐ రామారావు, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. శుక్రవారం మండలంలోని వన్నేదొడ్డి, బాచుపల్లి బాట సుంకులమ్మ ఆలయం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై, కొత్తపేట శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై అధికారులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. రెండు జాతీయ రహదారులతో పాటుగా రాష్ట్ర రహదారిపై మొత్తం ఆరు బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా నిర్ణయించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా సమీక్ష నిర్వహించారు.