యానాం కామిశెట్టివారి వీధిలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఇంట్లో బంగారు నగలు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
యానాం స్థానిక కామిశెట్టివారి వీధిలో నివసిస్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయిని కేఎన్ లక్ష్మి ఇంట్లో తెల్లవారుజామున బంగారు నగలు చోరీ అయ్యాయి. లక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించి పక్క గదిలోని రూ.18 లక్షల విలువైన 436 గ్రాముల బంగారు నగలు, వజ్రాలహారం, నక్లెస్, కలశహారం, పలకసర్లు, బ్రాస్ లెట్, గాజులు తదితర నగలను దొంగలు ఎత్తుకువెళ్లాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి ఎస్పీ రాజశేఖర్ పర్యవేక్షణలో విచారణ చేపట్టినట్లు సీఐ షణ్ముగం, ఎస్సై మురుగానందం తెలిపారు.