నసురుల్లాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష రూ. 200 జరిమానా : సీఐ నరహరి
కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిఐ నరహరి తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ ఒక్కరికి రెండు రోజులు జైలు శిక్ష మరియు రూ. 200 రూపాయల జరిమానా విధించినట్లు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ తెలిపారు. కాసం నిఖిల్ 26 సంవత్సరాలు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరిత చర్యలు తీసుకుంటామని సీఐ నరహరి హెచ్చరించారు.