డోన్: ప్యాపిలి లో ఉద్రిక్తత, ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి వచ్చిన జనసేన నాయకులను అడ్డుకున్న టిడిపి నేతలు
Dhone, Nandyal | Oct 23, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి జనసేన నాయకులు వచ్చారు. ఈక్రమంలో తమను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేసి పరిస్థితిని చక్కదిద్దారు.