నరసన్నపేట: నరసన్నపేటలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ: మధ్యాహ్నం వరకు 8 దరఖాస్తులు
నరసన్నపేట ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి ఈ.అనురాధ తెలిపారు. మాకివలస, లుకలాం, కంబకాయ అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు వేశారు.