కాకినాడ సిటీ: ఎన్నికల ప్రక్రియపై జై భీమ్ రావ్ భారత్ పార్టీ విమర్శలు
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియపై జై భీమ్ రావ్ భారత్ పార్టీ అసహనం వ్యక్తం చేసింది. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున మాట్లాడుతూ, ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.