శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో బాడుగలకు రూములు తీసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు రూముల బాడుగలు తగ్గించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రెడీమేడ్ షోరూం, వస్త్ర వ్యాపారస్తులు మాట్లాడుతూ గత 20 ఏళ్ళకు పైగా పాత బస్టాండు దగ్గర నాలుగు సంహాల యన్.టి.ఆర్ సర్కిల్ సమీపంలోని మునిసిపల్ కాంప్లెక్స్ వ్యాపార సముదాయ భవనంలోని రూములు అద్దెకు తీసుకొని వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగస్తున్నామని, అయితే కరోన సమయం నుంచి మాకు వ్యాపారాలు లేక బాడుగలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు.