ఖానాపూర్: కడెం మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరం: గుండె, ఎముకల పరీక్షలు
కడెం ప్రభుత్వ పాఠశాలలో స్వప్న మల్టీస్పెషల్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుండె, ఎముకలు, కీళ్లకు పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరానికి కడెం, దస్తురాబాద్ మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.