ఎమ్మిగనూరు: గోనెగండ్ల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
గోనెగండ్లలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు..గోనెగండ్ల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి బీవీ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 4 సార్లు మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారన్నారు.