ఎన్టీఆర్ నగర్ కంపాలెం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
తిరుపతి జిల్లా బీ.ఎన్. కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్, కాంపాలెం గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎస్ఐ విశ్వనాథన్ నాయుడు, తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని వాహనాల ధ్రువ పత్రాలు పరిశీలించారు. రికార్డ్స్ సరిగ్గా లేని మూడు బైకులు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ.. రికార్డులు లేని వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు.