పటాన్చెరు: గడ్డపోతారం ఫంక్షన్ హాల్లో నిల్వ ఉన్న రసాయన డ్రమ్ములపై నార్కోటిక్ శాఖ తనిఖీలు
గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో నిల్వ ఉన్న రసాయన డ్రమ్ములను ఆదివారం రాత్రి నార్కోటిక్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఓ ప్రముఖ రసాయన పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రసాయన డ్రమ్ములను ఫంక్షన్హాల్లో నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రమ్ములు ఏర్పాటు చేశారా, ఏమైనా అనుమ తులు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతు న్నారని తెలసింది. రసాయనాలు ఇక్కడ డ్రమ్ముల్లో నిల్వ ఉంచడంపై అధికారులు ఆరాతీస్తున్నారని తెలిసి