శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రి బేబీ రాణి మురియా
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర స్రీ శిశు సంక్షేమ సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి బేబీ రాణి బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి వేద ఆశీర్వచనం మండపంలో మంత్రి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగ, అధికారులు స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేశారు.