ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్ రాజబాబు
Ongole Urban, Prakasam | May 24, 2026
మే 25వ తేదీ సోమవారం ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు మీడియాకు ప్రకటన ఆదివారం విడుదల చేశారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడే ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కార్యాలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు. వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని ఈ సమయం మార్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.