రోడ్డు ప్రమాదాలు అరికట్టడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో గురువారం గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక టీడీపీ నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, నాయకులు పెద్ద తిప్పయ్యలు 40 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లను వితరణ చేయడంతో ఎస్సై శివతో కలసి డీఎస్పీ శ్రీనివాస్ డ్రైవర్లకు యూనిఫామ్ లను పంపిణీ చేశారు. డి.ఎస్.పి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత ప్రాముఖ్యమును క్షుణ్ణంగా వివరించారు. వాహనదారులు హెల్మెట్లు,సీట్ బెల్ట్ లు వాడకంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు.