నల్గొండ: జనగణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ: కలెక్టరేట్లో ముగిసిన రెండో రోజు తరగతులు
జిల్లా కలెక్టరేట్లో జనగణన నిర్వహణపై అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. సీపీవో శ్రీనివాస్ నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జనగణన విధివిధానాలపై వారికి అవగాహన కల్పించారు.