హనుమంతునిపాడు: హనుమంతునిపాడులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి నేలకొరిగిన వృక్షాలు, జెసిబి యంత్రాలతో తొలగించిన ఎస్ఐ రాజ్ కుమార్
India | Apr 30, 2026
హనుమంతుని పాడులో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆర్ అండ్ బి రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం అందుకున్న హనుమంతునిపాడు ఎస్సై రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి వృక్షాలు పడిపోయిన ప్రాంతానికి చేరుకొని, జెసిబి యంత్రాలతో వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.