ఒంగోలు అర్బన్: రాజ్యాంగాన్ని మార్చేదానికి ఒక్కో యంపీకి 50 కోట్ల ఇచ్చి కొంటున్నట్లు ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారు : కేంద్ర మాజీ మంత్రి
Ongole Urban, Prakasam | Jul 30, 2026
భారత రాజ్యాంగాన్ని మార్చేదానికి ఒక్కో యంపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి కొంటున్నట్లు ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారు అని కేంద్ర మాజీ మంత్రి, చింతామోహన్ అన్నారు. ఆగస్టులో అంబేద్కర్ రాజ్యాంగం పోయి, అమిత్ షా రాజ్యాంగం అమలు చేసే దానికి బిజెపి పక్క ప్లాన్ చేస్తోంది అని, ఉత్తర భారతదేశానికి 500 లోక్ సభ సీట్లు, దక్షిణ భారతదేశానికి 300 లోక్ సభ సీట్లు వస్తాయి అన్నారు.అదే జరిగితే భవిష్యత్తులో భారతదేశం రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది అని, ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలి అన్నారు.