శ్రీశైలం: 2000 మందితో శ్రీశైలంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం
శ్రీశైలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ గంగాధర మండపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మందికి పైగా స్థానికులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా గురువు బాలసుబ్రమణ్యం యోగాసనాల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ వివిధ ఆసనాలు చేయించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన యోగా కార్యక్రమం అనంతరం చైర్మన్, ఈవో మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతో అవసరమన్నారు.