కడప: ప్రాధాన్యత మేరకు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
Kadapa, YSR | Nov 27, 2025 ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి వరి ధాన్యం కొనుగోలు, మహిళలపై నేర నియంత్రణ, గంజాయి, మత్తు పదార్థాల నివారణ, సానుకూల ప్రజా దృక్పథం, జీఎస్ డబ్ల్యుఎస్ సేవలు, మున్సిపల్ సేవలు - పారిశుద్ధ్య చర్యలు, ఆర్.టి.జి.ఎస్, సంక్షేమ శాఖ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలలు, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.