మధిర: బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో దేవాలయ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో దేవాలయ ప్రారంభోత్సవ విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నెల 28న దేవాలయ ప్రారంభోత్సవం జరగనుండడంతో ఆదివారం రంగుల వేసే కార్యక్రమం జరుగుతుండగా గౌడ కులస్తులలోని ఓ వర్గం వారిపై రాళ్లు విసరడంతో 2 వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.