తిరుమలగిరి సాగర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ఉత్తమ ధాన్యాన్ని విక్రయించాలి: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని బోయగూడెం, రాజవరం గ్రామాలలో కొత్తపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల బారినపడి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.