శ్రీశైలం: నల్లమల అటవీ తీర ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో హెల్త్ రిసార్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ పర్యాటక ప్రాంతాలను 200 వరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పర్యాటకుల సౌకర్యాలు, సదుపాయాల కల్పనపై పూర్తి వివరాలతో ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యాటక, అటవీ, ఏకో టూరిజం కార్యదర్శులను ఆదేశించారు.ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, ఆత్మకూరు నల్లమల పెద్దపులుల అభయారణ్యం అంచుల్లో.. మరోవైపు కృష్ణానది తీర ప్రాంతం సంగమేశ్వరం సమీప సిద్దేశ్వరం అటవీ ప్రాంతంలో హెల్త్ రిసార్ట్ ను ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేయనుంధి.