కర్నూలు: కార్మికుల పని గంటలు పెంచడం అన్యాయమన్న కర్నూలు ఎఐటియుసి నాయకులు
కార్మికుల పని గంటలు పెంచడం అన్యాయమని ఏఐటీయూసీ, మహిళా సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఆ సంఘాల నేతలు చంద్రశేఖర్, భారతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచిందన్నారు. రాత్రి వేళల్లోనూ మహిళా కార్మికులు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు. పని గంటలు పెంచడం వల్ల కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురవుతారన్నారు. 10 చదవని వార్తలు