హిమాయత్ నగర్: రాజకీయ ఆరోపణలతో తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయొద్దు: యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యువతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలతో తిరుమల ప్రతిష్టను దెబ్బతీయొద్దని అన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ప్రతిష్టను రాజకీయ ఆరోపణలు తక్షణమే మానుకోవాలని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పై చేస్తున్న ఆరోపణలు తీవ్ర మనోవేదనను గురి చేస్తున్నాయని అన్నారు. తిరుమలపై జరుగుతున్న వివాదానికి తక్షణమే తెరదించాలని అన్నారు.