వికారాబాద్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశాలకు అర్హులైన SC విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం అర్హులైన షెడ్యుల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వికారాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలని సూచించారు. జిల్లాకు 2 సీట్లు కేటాయించారని, కలెక్టరేట్‌లో ఎఫ్-10 ఫారమ్‌ను పొందాలన్నారు. మార్చి 12లోగా సర్టిఫికెట్లు ఇవ్వాలన్న ఆయన.. పూర్తి వివరాలకు ఫోన్: 9573859268 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.