వికారాబాద్: యువత నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దు: మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల
యువత లైంగిక వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల రమేశ్ తెలిపారు. శనివారం జిల్లా యువజన శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో యువతకు లైంగిక వ్యాధులపై అవగాహన కల్పిస్తూ పోటీలను నిర్వహించారు. లైంగిక వ్యాధుల బారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.